![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-8 లో మొట్టమొదటగా హౌస్ లోకి పద్నాలుగు మంది ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అయిదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ ద్వారా ఏనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు. ఫినాలే కి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. ఫినాలే వీక్ లో టాప్-5 లేదా టాప్-6 మాత్రమే ఉంటారు.
అయితే లెక్క ప్రకారం ఈ టూ వీక్స్ లో హౌస్ లో నుండి నలుగురు బయటకు రావాలి. ఈ వారం ఇద్దరు, తర్వాతి వారం ఇద్దరిని బయటకు పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వారం హౌస్ మేట్స్ ఒపీనియన్ తో ఒకరిని మిడ్ వీక్ లోనే బయటకు పంపించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే శనివారం నాటి ఎపిసోడ్ లో ఒకరిని, ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఒకరిని పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్లంతా దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. ఇన్ని రోజులు హౌస్ లో నెట్టుకొచ్చారంటే తమ పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు ఓట్లు వేసి గెలిపించారనే అర్థం. ప్రతీ కంటెస్టెంట్ తమకంటు కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు యష్మీ బయటకు వచ్చింది కాబట్టి తన ఓట్లు అన్నీ కూడా నిఖిల్, పృథ్వీ, ప్రేరణలకి పడతాయి.
ఈ వారం నామినేషన్ లో రోహిణి, నబీల్ తప్ప అందరు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మిగతా ఏడుగురిలో.. ప్రేరణ, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణు, పృథ్వి నిఖిల్ నామినేషన్ లో ఉన్నట్లే. ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే తేజ, పృథ్వీలు హౌస్ లో నుండి బయటకు వస్తారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.
![]() |
![]() |